NTV Telugu Site icon

Rajanna Sirisilla District: బాబాయ్ ని ఇరికించేందుకు అబ్బాయి కిడ్నాప్ డ్రామా.. అవాక్కైన పోలీసులు

Kidnap (2)

Kidnap (2)

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంగరాజు కట్టుకథ వీడింది. ఘనుడు గంగరాజు పోలీస్ లానే బురిడీ కొట్టించాడు. కిడ్నాప్ డ్రామాగా పోలీసులు తేల్చారు. భూమి సమస్యలతో తన బాబాయ్ కుటుంబ సభ్యులను ఇరికించేందుకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. రెండు రోజుల పాటు కిడ్నాప్ అంటూ హైడ్రామా ఆడాడు. చందుర్తి మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎక్కల గంగారాజు అనే యువకుడు ( 28) అదృశ్యం డ్రామా నడిచింది. పొలం వద్ద ద్విచక్ర వాహనం, చెప్పులు, సెల్ ఫోన్, చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఎవరైనా హత్య చేసి ఉంటారా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బావిలో గాలించారు. కరీంనగర్ కి చెందిన గజ ఈత గాళ్ళతో వెతికించారు. జాగిలాలతో పరిసర ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. కిడ్నాప్ తెల్లవారు జామున తన పొలం కొంత దూరంలో గంగరాజు కాళ్ళు, చేతులు కట్టేసుకొని, చిన్న గాయాలతో బురద అన్న గడ్డిలో ప్రత్యక్షమయ్యాడు.

READ MORE: Kolkata Doctor Case: మమతా బెనర్జీ రాజీనామా చేయాలి.. ‘‘నిర్భయ’’ తల్లి ఆగ్రహం..

గుర్తుతెలియని వ్యక్తులు కాళ్ళను చేతులను కట్టేసి అడవిలో వదిలి వెళ్ళిపోయారని పోలీసులకి గంగరాజు తెలిపాడు. గంగరాజుపై పోలీసులకు అనుమానం రావడంతో లోతుగా విచారణ చేశారు. దీంతో హైడ్రామా బయటపడింది. తన బాబాయ్ ఎక్కల దేవి రాజయ్యతో భూ వివాదాలు ఉండటంతో క్రిమినల్ కేసుల్లో ఇరికించాలని ప్లాన్ వేసి కట్టుకథ అల్లినట్లు విచారంలో వెల్లడైంది. పోలీస్ లానే బురిడీ కొట్టించిన గంగరాజు పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చందుర్తి పోలీసులు తెలిపారు.

Show comments