NTV Telugu Site icon

Moinabad: ఉత్కంఠ రేపుతున్న మొయినాబాద్ యువతి మర్డర్ కేసు..

Moinabad Murder

Moinabad Murder

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో జరిగిన యువతి మర్డర్ కేసు సస్పెన్స్ రేపుతుంది. మూడు రోజులు గడుస్తున్నా సింగల్ క్లూ కూడా లభించలేదు. చనిపోయిన యువతి ఎవరో తేల్చే లేకపోతున్నారు పోలీసులు. కాగా.. చనిపోయిన యువతి ఎవరో తెలుస్తేనే హంతకుల్ని పట్టుకునే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. యువతి వయసు 20 సంవత్సరాల లోపు ఉంటుందని అంచనా వేస్తుండగా.. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది. కాగా.. మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోవడంతో ఐఎంఈ నెంబర్ సిమ్ కార్డు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. శాటిలైట్ నెట్ వర్క్ లొకేషన్, సిమ్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్, సిమ్ రిమూవ్ ఫ్రం ఫోన్ నెట్వర్క్ ట్రాకింగ్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు.

Read Also: YSRCP: పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై వైసీపీ కసరత్తు

ఇదిలా ఉంటే.. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు, టెక్నికల్ ఎవిడెన్స్, యువతి మొబైల్ ఫోన్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పైనే ఆధారం ఉంది. కాగా.. యువతి మర్డర్ కేస్ మిస్టరీ దర్యాప్తు కొరకు 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మర్డర్ స్పాట్ లో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ సెర్చింగ్ చేస్తోంది. అయితే.. అత్యవసరం సమీపంలో సీసీ కెమెరాలు ఫుటేజ్ పోలీసులకు లభించలేదు. ఒక రూట్ లో వచ్చి.. మరో రూట్ లో నిందితుల పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిని ఎక్కడో చంపి బైక్ మీద తీసుకువచ్చి ఇక్కడ కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానం చెందుతున్నారు.

Read Also: Karimnagar: ఆర్టీసీ బస్టాండ్లో కోడిపుంజు వేలం.. ఏందయ్యా ఇది..!

సోమవారం మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామ శివారులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ కు వెళ్ళే దారిలో యువతిని హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని గుర్తించకుండా పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. స్థానిక రైతులు కొందరు రోడ్డు పక్కన కాలుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికి మృతదేహాం కాలుతూనే ఉండడంతో రైతుల సాయంతో మంటలు ఆర్పారు. అప్పటి నుంచి పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.