NTV Telugu Site icon

Ganapathi Bappa Morya: ‘గణపతి బప్పా మోరియా’ లోని ‘బప్పా’, ‘మోరియా’ అనే పదాల అర్థం ఏంటో తెలుసా..?

Ganapathi Bappa Morya

Ganapathi Bappa Morya

The Meaning Of Ganapathi Bappa Morya: హిందువులు ఎంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి. హిందూ మతం ప్రకారం వినాయకుడు ఈ రోజున జన్మించాడు. ఈ రోజున భక్తులు తమ ఇళ్లలో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజిస్తారు. ఈ పండుగ నాడు ఎక్కడ చూసినా ‘గణపతి బప్పా మోరియా’ అనే అరుపులు వినిపిస్తాయి. అయితే ఈ మంత్రంలో ‘బప్పా’, ‘మోరియా’ అంటే ఏమిటో ఎప్పుడయినా అర్థం తెలుసుకున్నారా..? లేదు కదా.. మరి వాటి అర్థం ఏంటో ఒకసారి చూద్దాం.

Malaysia: కౌలాలంపూర్‌లో డ్రైనేజీలో పడి ఏపీ మహిళ గల్లంతు..

గణపతి బప్పా మోరియా అనే మంతంలో ‘బప్పా’ అనే పదానికి ఆప్యాయంగా అని అర్థం అవస్తుంది. తండ్రి, మామ, మనకంటే పెద్దవారిని, దేవుడు వంటి ప్రియమైన వారిని సంబోధించడానికి ఈ పదాన్ని తరచుగా వాడుతారు. ఈ కారణంగా, ఈ పదం దేవుడు వినాయకుడిని బప్ప గా సంబోధించడానికి ఉపయోగిస్తారు. ఇక మోరియా అనే పదం మరాఠీ సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పదం అత్యంత గౌరవాన్ని చూపుతుంది. మోరియా అంటే ” గొప్ప రాజు ” లేదా ” నాయకుడు ” అని అర్థం.

Fake TTE: ఎంతకు తెగించార్రా.. ఏకంగా నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడిన మహిళా..

అలాగే కొల్హాపురి మాండలికం ప్రకారం, మోరియా అనే పదం ‘మోహ్రే’ & ‘యా’ పదాల కలయికతో రూపొందించబడింది. ఈ మాండలికంలో మోహ్రా అంటే ” దయచేసి “, అలాగే యా అంటే ” రండి “. మోరియాను ప్రార్థనగా అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా గణేశుడు ఇంటికి వచ్చి అతని ఆశీర్వాదాలను ఇవ్వమని అర్థం వస్తుంది.

Show comments