NTV Telugu Site icon

Miss Universe: మిస్ యూనివర్స్ కావాలనుకునే మోడళ్లకు శుభవార్త..

Harnaaz Sandhu

Harnaaz Sandhu

ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగం పైన ఆసక్తి ఉంటుంది. కొందరు డాక్టర్ అవ్వాలనుకుంటే మరికొందరు యాక్టర్ అవ్వాలనుకుంటారు. కొందరికి బెస్ట్ డాన్సర్ అనిపించుకోవడం ఇష్టం, కొందరికి బెస్ట్ ఇంజినీర్ అనిపించుకోవడం ఇష్టం. అలానే కొందరికి ప్రంపంచం లోనే అందగత్తెగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశ. ఆ కాంక్షని నెరవేర్చుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తుంటారు.

పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన కొందరు మాత్రం వాళ్ళ కలని సాకారం చేసుకోలేపోతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వయసు. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనాలంటే కంచితంగా పాల్గొనే వారి వయసు 18 -28 సంవత్సరాలలోపే ఉండాలి. దీనితో చాలంది పోటీలో గెలవడం పక్కన పెడితే కనీసం పాల్గొనే అవకాశం కూడా లేక మిస్ యూనివర్స్ అవ్వాలనే కల తీరక మోడల్స్ గా మిగిలిపోతున్నారు. కానీ ఇకపైన అలాంటి సమస్య లేదు ఎందుకంటే ఇకపైన మిస్ యూనివర్స్ పోటీకి వయోపరిమితి లేదు.

విమెన్స్ వెర్ డైలీ న్యూస్ జర్నల్‌ సమాచారం ప్రకారం.. మిస్ యూనివర్స్ పోటీలకు 2024 వ సంవత్సరం నుండి గరిష్ఠ వయోపరిమితిని ఎత్తేస్తున్నారు. 2022 విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న మిస్ యూనివర్స్ “బోనీ గ్యాబ్రియెల్” న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తావిస్తూ.. మిస్ యూనివర్స్ పోటీలు మొదటిసారి1952లో నిర్వహించారు. ఇప్పటికి ఈ పోటీలు ప్రారంభమై 71 సంవత్సరాలు అవుతుంది.

అప్పటి నుండి ఇప్పటికి ఇందులో పాల్గొనే వాళ్ళ వయసు 18-28 మధ్య ఉండాలంటూ కనిష్ఠ-గరిష్ఠ వయోపరిమితిని పాటిస్తున్నారు. దీనివల్ల చాలామంది మిస్ యూనివర్స్ లో పాల్గొనే అవకాశం లేక వెనుదిరుగుతున్నారు అని పేర్కొన్నారు. ఈమె 2022 విశ్వ సుందరి పోటీలో పాల్గొనే నాటికి ఈ సుందరి వయసు 28 సంవత్సరాలు.

Also Read: iPhone 15 Price: భారత్‌లో కంటే తక్కువ ధరకే ఐఫోన్‌ 15 ఫోన్స్.. ఏకంగా 50 శాతం! ఎక్కడో తెలుసా?

దీనితో ఆమెకు పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇదే చివరి అవకాశం అనుకున్న బోనీ పట్టుదలతో విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. పోటీలో పాల్గొన్న సమయంలో ప్రశ్న-జవాబుల సెగ్మెంట్లో మిస్ యూనివర్స్ పోటీల అభివృద్ధి కోసం గరిష్ఠ వయోపరిమితిని తీసివేయాలని ఆమె ఓ సలహా ఇచ్చింది. ప్రస్తుతం నిర్వాహకులు ఆమె మాటలకి ఏకీభవిస్తూ గరిష్ఠ వయోపరిమితిని తీసేసారు. కాగా 2023 లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు వయోపరిమితి ఉంది. 2024 నుండి జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు గరిష్ఠ వయోపరిమితి ఉండదు.