NTV Telugu Site icon

RR vs KKR: రాజస్థాన్-కోల్కతా మ్యాచ్.. వర్షం కారణంగా రద్దు

Macth

Macth

ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ అప్పటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో.. రాత్రి 10.30 గంటల వరకు వేచి చూశారు. ఒకానొక సమయంలో వర్షం కురవడం ఆగిన తర్వాత గ్రౌండ్ మొత్తాన్ని గ్రౌండ్ సిబ్బంది రెడీ చేశారు. దీంతో.. అంఫైర్లు కూడా మ్యాచ్ జరిపించేందుకు సిద్ధం చేశారు. కాగా.. ఈ క్రమంలో.. అంఫైర్లు టాస్ వేయించగా, కేకేఆర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

World Biggest Banyan Tree : 250 ఏళ్ల వయస్సు.. 5 ఎకరాల విస్తీర్ణం.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టు.!

అయితే.. ఇరుజట్లు మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతుండగా మళ్లీ వర్షం కురుస్తుంది. దీంతో.. అంఫైర్లు ఇరుజట్ల కెప్టెన్లను పిలిచి మ్యాచ్ సాగేలా లేదని చెప్పేశారు. దీంతో.. మ్యాచ్ రద్దు చేస్తున్నామని తెలిపారు. దీంతో.. రెండు టీమ్ లకు చెరో పాయింట్ ఇచ్చారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ కొనసాగుతుండగా, రెండో స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది. మూడో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఉండగా, నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది.

Doctor of Literature : పిల్లికి ‘డాక్టర్ ఆఫ్ లిటరేచర్’ బిరుదు.. దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఇదే..!

కాగా.. మే 21న మంగళవారం క్వాలిఫైయర్ 1లో కోల్కతా నైట్ రైడర్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. మే 22న బుధవారం రాజస్థాన్ రాయల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఎలిమినేట్ అవుతుంది. ఆ తర్వాత క్వాలిఫైయర్ లో ఓడిన జట్టు ఎలిమినేటర్ విజేతతో మే 24వ తేదీన ఆడుతుంది. ఆ తర్వాత ఫైనల్ మే 26న చెన్నైలో జరుగనుంది.