NTV Telugu Site icon

PM Modi: మోడీ చేసిన ఒక్క ప్రకటనతో దూసుకుపోయిన మార్కెట్..

Pmmodi

Pmmodi

సరిగ్గా 5 రోజుల తర్వాత దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. అటువంటి పరిస్థితిలో.. నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని నిర్వహించాలని దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడిందని, ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకం ఎగరేయాలని కోరారు. ప్రధాన మంత్రి కూడా తన ప్రొఫైల్ పిక్చర్‌ని కూడా మార్చాలన్నారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటన ప్రభావంతో త్రివర్ణ పతాకాల విక్రయాలు 60-70 శాతం పెరిగాయి.

READ MORE: AP Crime: ఆత్మహత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రియుడి కోసం నగలు తాకట్టు పెట్టి కిరాయి ముఠాతో భర్త హత్య..!

ప్రధాని విజ్ఞప్తి కారణంగా మార్కెట్ వృద్ధి..
చాలా చోట్ల కార్యక్రమాలు 2-3 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 15కి వారం నుంచి పది రోజుల ముందు త్రివర్ణ పతాకాలు, వాటికి సంబంధించిన వస్తువుల విక్రయాలు పెరుగుతాయి. గత 3-4 రోజుల్లో త్రివర్ణ వస్తువుల విక్రయాలు 60-70 శాతం పెరిగాయి. ఇప్పుడు నిన్న ప్రధాని మోడీ మళ్లీ ‘హర్ ఘర్ తిరంగ అభియాన్’ను అమలు చేయాలని విజ్ఞప్తి చేయడంతో దాని ప్రభావం ఒక్కరోజులోనే 90 శాతం పెరిగింది. ప్రధానమంత్రి ఒక వారం ముందే ఈ విజ్ఞప్తిని చేసి ఉంటే, మరింత మార్కెట్ మరింత దూసుకుపోయేదని తయారీ దారులు అభిప్రాయపడుతున్నారు. దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు వస్తుండగా, విదేశాల నుంచి కూడా త్రివర్ణ పతాకానికి ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. భారతదేశం వెలుపల ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాలకు కూడా పంపుతున్నట్లు చెప్పారు.

READ MORE: AP Crime: ఆత్మహత్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ప్రియుడి కోసం నగలు తాకట్టు పెట్టి కిరాయి ముఠాతో భర్త హత్య..!

సదర్ బజార్‌లో ఓ వ్యాపారి మాట్లాడుతూ.. “మోడీ ప్రకటన తర్వాత ఆర్డర్లు పెరిగాయి. చాలా ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. నిన్న మోడీ విజ్ఞప్తి తర్వాత..మార్కెట్ మరింత ఊపందుకుంది. సమయం లేని కారణంగా నిన్న చాలా ఆర్డర్లు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ప్రధాని విజ్ఞప్తి ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ప్రతి ఇంటిపై జెండా ఎగురుతోంది.” అని పేర్కొన్నారు.