Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప”కు ఈ సినిమా సీక్వెల్ గాతెరకెక్కుతుంది.ఈ సినిమాలో కూడా అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు.కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడుతున్నట్లు సమాచారం.
Read Also :Gam Gam Ganesha : ఓటీటీలోకి వచ్చేస్తున్న గం గం గణేశా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ సినిమా వాయిదా పడుతుందనే న్యూస్ రావడంతో ఇదే తేదీన రామ్ పోతినేని ,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న “డబుల్ ఇస్మార్ట్” మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది.అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం.ఇంతవరకు ఈ సాంగ్ లో నటించే హీరోయిన్ ను మేకర్స్ ఫిక్స్ చేయలేదు.ఈ వారమే హీరోయిన్ ను ఫిక్స్ చేసి ఆ సాంగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో వున్నారు మేకర్స్.అయితే రీసెంట్ గా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ లో యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.దీనిపై మేకర్స్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు.