NTV Telugu Site icon

Vishal 34 : విశాల్ 34 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్..

Whatsapp Image 2023 11 27 At 12.23.31 Pm

Whatsapp Image 2023 11 27 At 12.23.31 Pm

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మార్క్ ఆంటోనీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విశాల్‌ ప్రస్తుతం మరో సినిమా విశాల్‌ 34 తో బిజీ అయిపోయాడు. ఈ మూవీ ఏప్రిల్‌ లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌ గా మొదలు అయింది. విశాల్‌ 34 అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేశారు.. చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తుండగా.. మధ్య లో స్టెతస్కోప్‌ చూడొచ్చు.విశాల్ ఇందులో డాక్టర్‌గా కనిపించబోతున్నట్టు ఈ లుక్‌ తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.

మాస్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్నాడు. భరణి మరియు పూజ సినిమాల తర్వాత హరి డైరెక్షన్‌ లో విశాల్‌ నటిస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.రీసెంట్‌ గా తమిళనాడు లోని తూతుకూడిలో విశాల్‌ 34 ఇంటెన్స్‌ క్లైమాక్స్‌ ను షూట్ చేస్తున్నట్టు మేకర్స్ అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టంట్‌ మాస్టర్‌ కనల్ కన్నన్‌తో విశాల్‌ దిగిన స్టిల్‌ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రం లో ప్రియా భవానీ శంకర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌-జీ స్టూడియోస్‌ బ్యానర్ల పై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటల కు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉందని మేకర్స్ తెలిపారు.