Site icon NTV Telugu

Guntur Kaaram : అక్కడ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్న మేకర్స్..?

Whatsapp Image 2023 10 07 At 10.50.02 Pm

Whatsapp Image 2023 10 07 At 10.50.02 Pm

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.హారికా అండ్ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.అయితే సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే ప్లాన్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సారి చెప్పిన డేట్‌ కన్ఫార్మ్‌ అని పదే పదే మేకర్స్‌ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ కూడా సంక్రాంతికే ఫిక్స్‌ అని చెప్పడం జరిగింది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది.నాలుగు పాటలకు సంబంధించిన మేకింగ్‌తో పాటు ఓ చిన్న టాకీ పార్టు కూడా ఉందట. త్రివిక్రమ్‌ ఈ సారి మహేష్ ను అదిరిపోయే మాస్ అవతారంలో చూపిస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సినిమా లో ఫస్ట్ సింగిల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గుంటూరు కారం ఫస్ట్‌ సింగిల్‌ ఆల్రెడీ రెడీ అయిపోయిందని నాగవంశీ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడు రిలీజ్‌ అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను లండన్‌లో రిలీజ్‌ చేయబోతున్నట్లు ఓ రూమర్‌ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇక ఇటీవలే థమన్‌ లండన్ లో లైవ్‌ కాన్సర్ట్‌ నిర్వహించబోతున్నట్లు తెలిపాడు. కాగా ఇదే కాన్సర్ట్‌లో గుంటూరు కారం ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు వార్తలు తెగ వైరల్‌ అవుతుంది.ఇందులో నిజమెంతుందో మాత్రం తెలియదు కానీ.. లండన్‌లో రిలీజ్‌ చేస్తే కనుక వేరే లెవెల్ లో ఉంటుంది.. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఓ పాటను రెడీ కూడా చేశాడట. దసరా సందర్భంగా ఈ పాటను రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..

Exit mobile version