NTV Telugu Site icon

Broken Earth: అకస్మాత్తుగా బద్దలైన భూమి.. ఎందుకో తెలుసా..!

Land

Land

అకస్మాత్తుగా ఎక్కడైనా భూమి బద్దలైతే.. ఏమౌతుంది. అందరు భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా రోడ్లపై ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం వంటివి చూస్తుంటాం. కానీ ఈ ఘటన చూస్తుంటే సినిమాలలో కారు గాల్లోకి లేసే సీన్లు గుర్తుకువస్తుంది. రద్దీగా ఉండే రోడ్డుపైనే వాహనాలు ఆగి ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారి భూమి బద్దలైంది. దీంతో అక్కడున్న వాహనాలు గాల్లోకి ఎగిరాయి. చుట్టుపక్కల ఉన్నవాళ్లు భయాందోళనలకు గురయ్యారు.

Jordan Restaurant: అబ్బో ఆ రెస్టారెంట్ లో తిన్నాక.. కాసేపు హాయిగా పడుకోవచ్చు..

ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. భూమి లోపల గ్యాస్ పైప్‌లైన్ అకస్మాత్తుగా పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఐతే ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు యంత్రాంగం అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. ఈ వీడియోను @BernieSpofforth అనే IDతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఈ ప్రమాదం గ్యాస్ లీక్ వల్ల జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు.

Priya Prakash Varrier: బీచ్లో బికినీతో రచ్చ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్

మరోవైపు ఈ వీడియోను ఇప్పటికి 2 లక్షలకు పైగా మంది చూశారు. అంతేకాకుండా వందలాది మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్యాస్‌ లీక్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కొందరంటే, ‘వాతావరణ మార్పు’ ప్రభావం వల్లే జరిగిందని మరికొందరు చెబుతున్నారు.