Site icon NTV Telugu

Viral Video: అడవికి రాజు సింహామే.. ఈ వీడియో చూస్తే ఎందుకంటారో మీకే తెలుస్తుంది..!

Lion

Lion

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలను యూజర్లు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. మాములుగా అయితే ఒక జంతువుపై మరొక జంతువు దాడి చేయడాన్ని చాలా శ్రద్ధతో చూస్తారు. అంతేగాక ఆ వీడియోలను చూస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. అడవుల్లో జరిగే అలాంటి వీడియోలను కొందరు యానిమల్ లవర్స్ షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అయితే అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత సింహాన్ని అడవికి రాజు అని ఎందుకు పిలుస్తారో మీకే అర్థమవుతుంది.

CM KCR: తెలంగాణలో వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

అడవిలో సింహం, పులి, చిరుత సామాన్యంగా ఏ జంతువులకు భయపడవు. అవి గర్జిస్తేనే అడవిలో ఉన్న జంతువులన్నీ వణికిపోతాయి. మరీ ముఖ్యంగా అడవిలో జంతువులు సింహానికి భయపడినంతగా.. ఇంకే జంతువుకు భయపడవు. అందుకే అడవికి రాజు సింహాం అంటారు. సింహాం కనపడిందంటే.. జంతువులన్నీ కనపడకుండా దాక్కుంటాయి. ఒకవేళ సింహం కంట పడ్డాయంటే.. వాటికి చివరి రోజే అవుతుంది. అలాంటింది.. సింహాలున్న చోట ఓ మొసలి ఆహారం కోసం వేచి చూస్తుంది.

Taapsee Pannu : ఆ కారణంగా సోషల్ మీడియా కు దూరంగా వున్నాను..

సింహాలుండే చోటుకు వెళ్లిన మొసలి తమ ఆహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించడం వీడియోలో చూడవచ్చు. వెంటనే సింహాల గుంపు అక్కడికి చేరుకుని.. మొసలికి తమ బలాన్ని చూపించడం మొదలు పెడుతాయి. ఆకలిగా చూస్తున్న మొసలిని తినకుండా.. రెండు సింహాలు తరిమికొడుతూ ఉంటాయి. ఈ వీడియో యూట్యూబ్‌లో షేర్ చేశారు. కొంతమంది పర్యాటకులు ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించినట్లు తెలుస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత సింహం నిజంగా అడవికి రారాజు అని ఒకరు రాయగా.. సింహాల ముందు మొసలి ధైర్యాన్ని మెచ్చుకోవాలంటూ మరికొందరు రాశారు.

 

Exit mobile version