KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులుమనాలీ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎమాషనల్ యాక్షన్ డ్రామాలో నాగ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.
తాజా సమాచారం ప్రకారం మే నెల నాటికి నాగార్జునకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై ఫోకస్ చేయనుంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ‘లాటరీ కింగ్’, ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంలో నాగ్ డి-ఏజింగ్ టెక్నాలజీ ద్వారా 25 ఏళ్ల యువకుడిగా కనిపించబోతుండడం.. సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. సీనియర్ నటి టబు ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుండగా.. నాగార్జున సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 100వ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే.. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను అందించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణతో నాగ్ మరోసారి చేతులు కలుపుతున్నారు. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్‌గా న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్‌తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!