Site icon NTV Telugu

Licence Cancelled: అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు లైసెన్స్ రద్దు.. రూ.2.5 లక్షల ఫైన్

Licence Cancelled

Licence Cancelled

Licence Cancelled: ప్రమాదంలో ఉన్న రోగులను తరలించేందుకు అంబులెన్స్‌ను అడ్డుకున్న ఓ కారు యజమానికి కేరళ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసారు. ఈ ఘటనలో అతడికి ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు ఫైన్ వేశారు ట్రాఫిక్ పాలీసులు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. డ్రైవర్‌ బాధ్యతారాహిత్యానికి పాల్పడినందుకు కేరళ పోలీసులు చేసిన పనికి వారికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో రద్దీగా ఉండే రోడ్డుపై కారు వెళ్తోంది. ఆ కారు వెంబడే అంబులెన్స్ వస్తుంది. అయితే, లోపల రోగి పరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉండడంతో అంబులెన్స్ డ్రైవర్ వేగంగా నడుపుతున్నాడు. ఆ సమయంలో అంబులెన్స్ సైరన్ మోగిస్తానే ఉన్నాడు. సదరు అంబులెన్స్ డ్రైవర్ కారును పక్కకు తప్పుకోవాలనే ఉద్దేశ్యంతోనే హారన్ కూడా మోగించడం మొదలుపెట్టాడు. అలా ఒకేసారి సైరన్, హారన్ మోగుతున్నా సదరు కారు డ్రైవర్ వారికి దరి ఇవ్వలేదు.

Read Also: Woman drown: రిసార్ట్ స్మిమ్మింగ్‌ పూల్‌లో మునిగి యువతి మృతి.. రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా..

ఈ ఘటన కొన్ని కిలోమీటర్ల పాటు జరిగింది. ఆ సమయంలో అంబులెన్సు ముందు భాగంలో కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంబులెన్స్ డ్రైవర్ ను కూడా విచారించిన పోలీసులు.. వారు ఇచ్చిన సమాచారంతో కారును నడిపిన యజమాని ఇంటి వద్దకు వెళ్లి మరీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఏకంగా రెండున్నర లక్షల జరిమానా విధించారు. ఇకపోతే, అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వాహనాలకు దారి ఇవ్వాల్సిన కనీస బాధ్యత మోటారు వాహనాల చట్టం ప్రకారం.. వాహనం నడిపే ప్రతి ఒక్కరి డ్రైవర్ పైనా ఉంటుంది. దీన్ని ఉల్లంఘించినందుకు గాను అతనికి ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధించి లైసెన్స్ కూడా రద్దు చేసారు. దీనితో పోలీసుల చర్యపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version