NTV Telugu Site icon

The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు ఫస్ట్ డే మైండ్ బ్లోయింగ్ కలెక్షన్స్

The Kerala Story

The Kerala Story

The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ సినిమా నిన్న(శుక్రవారం) మే 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చెలరేగడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారని అందరి దృష్టి నెలకొంది. ఈ సినిమాలో 32 వేల మంది మహిళలను మతం మార్చారన్న వాదనలు అవాస్తవమని పలు రాజకీయ పార్టీలు, మత సంస్థలు ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేశాయి. ఇన్ని వివాదాల మధ్య ఈ సినిమా విడుదలై తొలిరోజు వసూళ్ల వర్షం కురిపించింది.

Read Also:Telangana Police: కచ్చితంగా ఉండాల్సిందే.. బైక్‌ కొనేవారికి పోలీసులు కొత్తరూల్స్‌

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ మొదటి రోజు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది. జనాలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఈ సినిమా తొలిరోజు వసూళ్ల లెక్కలు బయటకు వచ్చాయి. ‘సాక్‌నిల్క్’ నివేదిక ప్రకారం, ‘ది కేరళ స్టోరీ’ విడుదలైన మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్లు వసూలు చేసింది. ఇది ఒక అంచనా మాత్రమే. కాబట్టి అధికారిక సంఖ్య వెలువడిన తర్వాత కొద్దిగా మారవచ్చు. మరోవైపు ఈ సినిమా వీకెండ్ కలెక్షన్లలో కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

Read Also:Patan Cheru : వామ్మో.. ఒక్క ఇంట్లో 120ఓట్లా.. ఎన్నికల అధికారులే షాక్

గతంలో ఈ సినిమాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీని ఎగ్జిబిషన్‌ను నిషేధించాలని కోరుతూ కోర్టుల్లో అనేక పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు శుక్రవారం ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే విధించేందుకు నిరాకరించింది. కేరళలో 32 వేల మందికి పైగా మహిళలు ఐఎస్‌ఐఎస్‌లోకి రిక్రూట్ అయ్యారని చెబుతున్న ఈ సినిమా టీజర్‌ను వారి సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగిస్తామని నిర్మాత హైకోర్టుకు హామీ ఇచ్చారు.