సంచలన విజయం సాధించిన ‘ది కేరళ స్టోరీ’కి స్పిరిచువల్ సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’. థియేటర్లలో ఫిబ్రవరి 27న విడుదలై చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. అయితే మొదట ప్రకటించిన తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.vప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. తొలుత మే 8న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, తాజా అప్‌డేట్ ప్రకారం..
మే 1, 2026 నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది.ఈ సినిమా ముగ్గురు అమ్మాయిల కథల చుట్టూ తిరుగుతుంది. సురేఖ (ఉల్కా గుప్త).. కేరళకు చెందిన యూపీఎస్సీ ఆస్పిరెంట్. జర్నలిస్ట్ సలీమ్ (సుమిత్ గహ్లావత్)తో ప్రేమలో పడి లివింగ్ ఇన్ రిలేషన్‌లోకి వెళ్తుంది. దివ్య (అదితి భాటియా) సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కావాలని కలలుగనే అమ్మాయి. తనను ప్రేమిస్తున్నానంటూ అండగా ఉంటానని నమ్మించిన రషీద్ (యుక్తం) వలలో చిక్కుకుంటుంది. ఇక నేహా (ఐశ్వర్య ఓజా).. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనుకునే నేహాను, రాజు అలియాస్ ఫైజన్ ప్రేమ పేరుతో ఢిల్లీకి తీసుకువెళ్తాడు. తల్లిదండ్రుల మాటలను కాదని వెళ్లిన ఈ ముగ్గురు అమ్మాయిలకు ఎదురైన చేదు అనుభవాలు, మోసాలు, వారు తీసుకున్న తుది నిర్ణయం ఏమిటనేది ఈ సినిమా.
