Kerala Story 2: కేరళ స్టోరీ 2 ‘బీఫ్’ వివాదం.. ప్రకాష్ రాజ్ సెటైరికల్ కౌంటర్..

Prakasj Raj Kera

Prakasj Raj Kera

సంచలన విజయం సాధించిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. లవ్ జీహాద్, బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఒక ముస్లిం కుటుంబం ఒక అమ్మాయికి బలవంతంగా బీఫ్ (గోమాంసం) తినిపించినట్లు చూపించిన దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది.

Also Read : Rashmika : లెస్బియన్ పాత్రలో రష్మిక మందన్న..?

ఈ వివాదంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ తన ఎక్స్ (Twitter) ఖాతాలో పంది మాంసం, బీఫ్, చేపలు, శాఖాహార వంటకాలతో కూడిన ‘కేరళ సద్యా’ ఫోటోను షేర్ చేశారు’ అన్ని రకాల వంటకాలు కలిసి సామరస్యంగా ఉండటమే నిజమైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చి చిత్ర యూనిట్‌కు గట్టి చురకలు అంటించారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందిస్తూ.. మత సామరస్యానికి మారుపేరైన కేరళను తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నాలను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ప్రజంట్ సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్ పోస్ట్ వైరల్ గా మారింది.