Site icon NTV Telugu

Kashmir Files : ఆస్కార్‎కి అర్హత పొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’

The Kashmir Files

The Kashmir Files

Kashmir Files : ఎన్నో వివాదాల నడుమ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కాశ్మీరీ ఫైల్స్ ఆస్కార్ 2023కి అర్హత పొందింది. భారతదేశం నుండి ఆస్కార్‌‎కు ఎంపికైన 5 చిత్రాలలో ఇది ఒకటి. ఈ శుభవార్తను చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 2022లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ గురించి పెద్ద వార్తలు వస్తున్నాయి. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆస్కార్ 2023కి క్వాలీఫై అయింది. ఈ క్రమంలో వివేక్ అగ్నిహోత్రి ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో సంబంధం ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది మాత్రమే కాదు, ది కాశ్మీర్ ఫైల్స్ నటీనటుల్లో పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, అనుపమ్ ఖేర్ అందరూ ఉత్తమ నటుల విభాగంలో షార్ట్ లిస్ట్‌లో ఉన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని పేర్కొన్నారు.

Read Also: RRR Movie: రాసిపెట్టుకోండి ట్రిపుల్‎ఆర్‎కు ఆస్కార్ రాకపోతే.. నాది ఇచ్చేస్తా: హాలీవుడ్‌ నిర్మాత జాసన్‌ బ్లమ్‌

ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం 11 మార్చి 2022న విడుదలైంది. ఇది మల్టీస్టారర్ చిత్రం. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై చాలా వివాదాలు చెలరేగాయి. రాజకీయ నాయకులు కశ్మీర్ ఫైల్స్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి ప్రచార చిత్రం అనే ట్యాగ్ వచ్చింది. కాశ్మీర్ ఫైల్స్ 1990లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాల కథను చూపుతుంది. ఈ సినిమా ఎన్నో వివాదాలు సృష్టించినా, బాక్సాఫీస్ వద్ద భయాందోళనలు సృష్టించింది. త‌క్కువ బ‌డ్జెట్ మూవీ ద కాశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇండియాలో 252 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా 341 కోట్లు వసూలు చేసింది. కాశ్మీర్ ఫైల్స్ 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ హిందీ చిత్రం.

Exit mobile version