Site icon NTV Telugu

Akhanda2 : అఖండ 2 రిలీజ్ వాయిదాపై రాజాసాబ్ నిర్మాత ఆవేదన

Tg Vishwaprasad

Tg Vishwaprasad

బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. స్టార్ హీరో సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. కారణాలు ఏవైనా సరే స్టార్ హీరో సినిమా రిలీజ్ ఆగిపోవడం అనేది భాదాకరమైన పరిస్థితి. అఖండ 2 రిలీజ్ ఆగడంపై టాలీవుడ్ బడా నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ‘ విడుదలకు ముందు సినిమాలు ఆగిపోవడం దురదృష్టకరం. అది పరిశ్రమలోని వివిధ రంగాలపై చూపే ప్రభావం చూపుతుంది. చిన్న సినిమా నిర్మాతలు తమ సినిమాలను పెద్ద సినిమాల పాటు విడుదల చేయడానికి చూస్తుంటారు.

ఇక బాలయ్య నటించిన అఖండ 2 రిలీజ్ వాయిదా వేయడం నన్ను తీ వ్రంగా కలవరపెట్టింది. రిలీజ్ రోజు వాయిదా వేయడం అనేది సినిమా నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్, సాంకేతిక నిపుణులు  పర్యావరణ వ్యవస్థలోని వేలాది మంది జీవనోపాధిని ప్రభావితం చేస్తాయి. భవిష్యత్తులో మరోసారి ఇలా థర్డ్ పార్టీలు( ఫైనాన్స్) చేసే చివరి నిమిషం అంతరాయాలను నివారించడానికి స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలను రూపొందించడం చాలా ముఖ్యం. సినిమాల విడుదల టైమ్ లో ఇలా వాయిదా వేసేటువంటి బాధ్యతారహిత ప్రయత్నాలపై భవిష్యత్తులో నివారణ చర్యలు చేపట్టడానికి తగిన చట్టపరమైన చర్యలను వాటాదారులు రూపొందించాలి. ఎటువంటి సమస్యలు ఉన్న కూడా ముందుగానే వాటిని క్లియర్ చేసుకోవాలి. ఇలా రిలీజ్ రోజు ఇబ్బందులు పెట్టకూడదు. అన్ని సమస్యలు అభిగమించి అఖండ 2 గ్రాండ్ రిలీజ్ కావాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాము’ అని ట్వీట్ చేశారు.

Exit mobile version