NTV Telugu Site icon

IPL Auction 2025: ప్రారంభమైన ఐపీఎల్ మెగా వేలం.. వీరిపైనే భారీ అంచనాలు

Ipl 2025 Mega Auction

Ipl 2025 Mega Auction

ఐపీఎల్ మెగా వేలం (IPL 2025) ప్రారంభమైంది. ఆది, సోమవారాల్లో జెడ్డాలో జరుగనుంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపించబోతోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తేలనుంది. పది ఐపీఎల్ జట్లకు రూ.641.5 కోట్ల పర్స్ ఉండగా.. వేలంలో 204 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. మొదటి రోజు (ఆదివారం)84 మంది ఆటగాళ్లను వేలం వేయవచ్చు. ఈ క్రమంలో అందరి చూపు రెండు మార్క్యూ సెట్లపైనే ఉండనుంది.

Read Also: Satya: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ లో పోటీకి దిగిన సాయి తేజ్ “సత్య”

ఐపీఎల్ 2025 వేలంలో మార్క్యూ ప్లేయర్‌ల జాబితా రెండు గ్రూపులుగా విభజించారు. ఇందులో మొత్తం 12 మంది ఆటగాళ్లు ఉంటారు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, KL రాహుల్‌తో సహా ఏడుగురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించేందుకు ప్రాంచైజీలు సిద్ధంగా ఉన్నారు. జెడ్డాలో 330 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లపై కూడా బిడ్డింగ్ జరుగుతుంది. ఇందులో 318 మంది భారతీయ మరియు 12 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్‌లోని 10 జట్లలో 204 మంది ఆటగాళ్లకు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లు చోటు సంపాదించవచ్చు. ఆటగాళ్ల వేలం జాబితా విడుదలైన కొద్ది రోజుల తర్వాత, బీసీసీఐ వేలం జాబితాలో ముగ్గురు ఆటగాళ్లను చేర్చింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, అమెరికన్ ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రవాల్కర్, హార్దిక్ తమోర్ ఉన్నారు.

Read Also: Maharashtra CM: మహారాష్ట్ర సీఎం ఎవరు..? నేడు మహాయుతి కీలక సమావేశాలు..