NTV Telugu Site icon

Indian Hockey Team: ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారత హాకీ జట్టుకు ఘన స్వాగతం..

India Hockey

India Hockey

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు శనివారం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత ఆటగాళ్లకు డప్పు వాయిద్యాలతో, పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వేసి ఉదయం నుంచి భారత ఆటగాళ్ల కోసం విమానాశ్రయం లోపల అభిమానులు భారీ సంఖ్యలు వేచి ఉన్నారు. ఆటగాళ్లు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. ఇదిలా ఉంటే.. పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత భారత హాకీ జట్టు ఆటగాళ్లు ఢిల్లీ విమానాశ్రయం వెలుపల సంబరాలు చేసుకున్నారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు.

S Jaishankar: మాల్దీవుల ప్రెసిడెంట్‌తో జైశంకర్ భేటీ..ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ..

ఈ సందర్భంగా హాకీ ఇండియా జనరల్ సెక్రటరీ భోళనాథ్ సింగ్ మాట్లాడుతూ.. పారిస్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో జెండా బేరర్‌గా పీఆర్ శ్రీజేష్ ఎంపిక కావడం గురించి మాట్లాడారు. పిఆర్ శ్రీజేష్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో పతాకధారిగా అర్హుడని తెలిపారు. భారత ప్రభుత్వం, భారత ఒలింపిక్ కమిటీ అతనికి ఈ అవకాశాన్ని కల్పించినందుకు హాకీ ఇండియా తరుఫున ధన్యవాదాలు తెలిపారు. వరుసగా రెండు పతకాలు సాధించడం ఒక గొప్ప విజయం అని అన్నారు. తమ లక్ష్యం ఫైనల్ ఆడటం, కానీ అమిత్ రోహిదాస్‌ను సిట్ అవుట్ చేయడంలో రిఫరీ చేసిన పొరపాటు కారణంగా తాము ఓడిపోయామన్నారు. అందుకే తాము కాంస్య పతకంతో ఇక్కడకు వచ్చాము. లేకుంటే పతకం రంగు మారి ఉండేదని పేర్కొన్నారు.

Manish Sisodia: అలా చేస్తే 24 గంటల్లో కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వస్తారు..

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత హాకీ జట్టు పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారిస్‌లో కూడా భారత్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. కాంస్య పతక పోరులో భారత్ 2-1తో స్పెయిన్‌ను ఓడించింది. అంతకుముందు సెమీస్‌లో జర్మనీ చేతిలో భారత్ 3-2 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 1980లో మాస్కో ఒలింపిక్స్ తర్వాత హాకీలో భారత్ స్వర్ణం సాధించలేదు. హాకీలో భారత్ ఇప్పటి వరకు ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 13 పతకాలు సాధించింది. భారత పురుషుల హాకీ జట్టు 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది. ఇంతకు ముందు 1968, 1972లో పతకాలు సాధిచింది.