NTV Telugu Site icon

Hydra: టెన్షన్.. టెన్షన్.. అమీన్ పూర్‌కు చేరుకున్న హైడ్రా బృందం..

Hydraa

Hydraa

హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. హైడ్రా బృందం సోమవారం అమీన్ పూర్‌కు చేరుకుంది. జేసీబీలు, డిజాస్టర్ టీంతో సహా పటేల్ గూడకు అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్, హైడ్రా అధికారులు చేరుకున్నారు. పటేల్ గూడ గ్రామ‌ పంచాయతీ పరిధి గతంలో సర్వే నంబర్ 12 లో కూల్చివేతలు ప్రారంభించింది. కూల్చివేసిన శిథిలాలను‌ తొలగిస్తారా?.. లేక మరిన్ని ఇండ్లను‌ కూల్చి వేస్తారా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

READ MORE: Sankrantiki Releases 2025: ముగ్గురు స్టార్లు.. నాలుగు సినిమాలు.. ఎప్పుడెప్పుడంటే?

ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 22న కూడా గారెడ్డి జిల్లా అమీన్​పూర్​లోనూ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. పటేల్​గూడ, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లో 28 నిర్మాణాలను నేలమట్టం చేశారు. వాటిలో 25 విల్లాలు, మూడు అపార్ట్​మెంట్లు ఉన్నాయి. కూల్చివేతలు రాత్రింబవళ్లు కొనసాగాయి. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన జనాలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ సందర్భంగా వారంతా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర కిలో మీటర్ దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. కూల్చివేతల వైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు.

READ MORE:AP Assembly Sessions 2024 LIVE UPDATES: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ అప్‌డేట్స్

Show comments