Site icon NTV Telugu

Crime: కాపురానికి రాలేదని భార్యను కత్తితో నరికిన భర్త

Uppal Crime

Uppal Crime

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన భర్త తన కుమార్తె ముందే కత్తితో నరికాడు. భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాయాదమరి మండలం లక్ష్మయ్య కండ్రిగ బస్ స్టాప్ వద్ద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదమరి మండలం లక్ష్మయ్య కండ్రిగ కు చెందిన స్వాతికి.. గుడిపాల మండలం పేయన పల్లి కి చెందిన ఉమాపతికి గత పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా భర్తతో విభేదించిన స్వాతి లక్ష్మయ్య కండ్రిగ లో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఇవాళ కండ్రిగలోని బస్ స్టాప్ వద్ద ఉన్న స్వాతిని కాపురానికి రమ్మని భర్త ఉమాపతి పిలిచాడు.

READ MORE: Monsoon: సమయం కంటే ముందే దేశంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ..

మాట మాట పెరగడంతో భార్యను తొమ్మిదేళ్ల కూతురు సదాశ్రీ ఎదుటే కత్తితో నరికాడు ఉమాపతి. కూతురు సదాశ్రీ తన తల్లిని తండ్రి కత్తితో నరికాడని 108కు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రురాలిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్ళు ఎదుటే తల్లిని నరకడంతో బాలిక సదాశ్రీ ఆందోళనకు గురైంది. బాధితురాలు స్వాతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు వెస్ట్ సిఐ రవి శంకర్ రెడ్డి తెలిపారు.

Exit mobile version