Water Melon: ఎండాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రత కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ, ఉక్కపోతతో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ వేడిని తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లు వాడటం మొదలు పెట్టేసారు కూడా. అయితే, ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొన్ని పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం పుచ్చకాయ (వాటర్ మిలన్) చాలా ముఖ్యమైనది. ఇది శరీరానికి తగినంత నీరును అందించి హైడ్రేషన్ కల్పిస్తుంది.
Read Also: STOP Drinking Alcohol: ఒక్కసారిగా మద్యం తాగడం మానేస్తే ఇన్ని సమస్యలా?
అయితే, చాలామంది పుచ్చకాయను కట్ చేసి, ఫ్రిజ్‌లో ఉంచి మరలా తినే అలవాటు చేసుకుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఫ్రిజ్‌లో ఎక్కువ సమయం ఉంచినప్పుడు పుచ్చకాయ తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. పుచ్చకాయలో 90% నీరు ఉండటం వల్ల ఇది తేమ ఎక్కువగా కలిగి ఉంటుంది. ఫ్రిజ్‌లో తేమ ఎక్కువగా ఉండే కారణంగా.. ఈ తేమ బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. అంతేకాదు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది.
Read Also: AP Assembly: అసెంబ్లీ వైపు చూడని ఎమ్మెల్యేలు..! భారీగా తగ్గిన హాజరు..
ఇలా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గవచ్చు. దీనివల్ల చర్మ సమస్యలు, అలర్జీలు, జుట్టు రాలిపోవడం, ఇంకా అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే, పుచ్చకాయను కట్ చేసిన తర్వాత వెంటనే తినడం ఉత్తమం. సురక్షితంగా పుచ్చకాయను తినేందుకు పుచ్చకాయను తాజాగా తినడం ఉత్తమం. ఫ్రిజ్‌లో నిల్వ చేయకుండా, కట్ చేసిన వెంటనే తినడం ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయను కట్ చేసే ముందుగా చేతులను, వాడే కత్తిని శుభ్రంగా కడగాలి. కొనేముందు సహజమైన, మంచి నాణ్యత కలిగిన పుచ్చకాయను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువసేపు బయట ఉంచిన పుచ్చకాయలను తినడం వల్ల కూడా బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది.