Site icon NTV Telugu

Marriage: పెళ్లిలో అత్తమామలను చెప్పుతో కొట్టిన వరుడు.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే..?

Marriage

Marriage

ఉత్తర ప్రదేశ్లో ఓ పెళ్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. కాబోయే అత్తామామలను వరుడు చెప్పుతో కొట్టాడు. పెళ్లికి ముందు తాగి మండపానికి వచ్చిన వరుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి పీటల మీద కూర్చున్న వధువుకు కోపమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుని అత్తమామల పట్ల గౌరవంగా ఉండాల్సిన వరుడి ప్రవర్తన పట్ల పెళ్లికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

Read Also: ఎక్స్‌లో 100 మిలియన్ ఫాలోవర్స్‌ కలిగిన ప్రపంచ సెలబ్రిటీలు వీరే!

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బండాలో వరుడు దిలీప్ (25)తో వధువు అంజలి (18) వివాహం జరుగుతుంది. ఇంకాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా.. పెళ్లి మండపంపై ఉన్న వధువు తల్లిదండ్రులను వరుడు దిలీప్ ఒక్కసారిగా చెప్పుతో కొట్టాడు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు షాక్ కు గురయ్యారు. కాగా.. తన తల్లిదండ్రులపై ఇలాంటి ఘటనకు పాల్పడిన దిలీప్ పై వధువు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Also: Kiran Abbavaram: నీకు పాన్ ఇండియా సినిమా ఎందుకున్న రిపోర్టర్.. కిరణ్ అబ్బవరం షాకింగ్ సమాధానం

దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడు దిలీప్, అతని కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వధువు తరుఫు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. బంధువుల జోక్యంతో ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఆ తర్వాత ఆలయంలో ఇరువర్గాల సమక్షంలో వధూవరులకు వివాహం జరిపించారు. కాగా.. ఈ ఘటనపై ఇరువర్గాలు అంగీకారంతో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని, పెళ్లి పూర్తి అయిందని పోలీసులు తెలిపారు.

Exit mobile version