ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో 2025లో విడుదలైన కామెడీ డ్రామా సినిమా. 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్ బ్యానర్స్‌పై సందీప్ అగరం నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. మాస్టర్ రోహన్ రాయ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా కుటుంబ నేపథ్యంలో నడిచే వినోదాత్మక కథతో తెరకెక్కిగా గతేడాది నవంబరు 7 న రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. పల్లెటూరి నేపథ్యం, చక్కటి కామెడీ, అద్భుతమైం కథ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
Also Read : War Efeect : మిడిల్ ఈస్ట్ వార్.. మరొక స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా
ఇదిలా ఉండగా ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ ప్రకటించిన ప్రతిష్టాత్మక Telangana Gaddar Film Awardsల్లో The Great Pre Wedding Show చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. గద్దర్ అవార్డుల్లో ఈ సినిమాకు థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంతో పాటు సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన మాస్టర్ రోహన్ రాయ్‌కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. థియేటర్ & ఓటీటీలో సూపర్ హిట్ అయినా ఈ సినిమా ఇప్పుడు గద్దర్ అవార్డుల్లో రెండు విభాగాల్లో గెలుపొందడం ద్వారా ఈ చిత్రానికి మరింత గుర్తింపు లభించింది. చిన్న సినిమాగా వచ్చిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రేక్షులతో ది గ్రేట్ అనిపించుకుని రెండు అవార్డులు అందుకోవడం పట్ల నిర్మాత సందీప్ అగరం సంతోషం వ్యక్తం చేస్తూ ‘ ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది 7 పి.ఎం.ప్రొడక్ష్సన్స్ లో మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. కథ బలంతో పాటు అందరిని అలరించేలా ఉంటాయి. టాలివుడ్ కు చెందిన యంగ్ హీరో ఈ సినిమాలో నటిస్తాడు. అలాగే తమిల్ హీరోతో మరొక సినిమా చర్చల దశలో ఉంది అని అన్నా
