War Efeect : మిడిల్ ఈస్ట్ వార్.. మరొక స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన సంచలన ఫ్రాంచైజీ ‘దృశ్యం’. ఈ సిరీస్‌లో రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3’ కోసం ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సినిమా విడుదల నిరవధికంగా వాయిదా వేశారు
Also Read : Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్
Also Read
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు యుద్ధ వాతావరణం ఈ వాయిదాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాలు అతిపెద్ద మార్కెట్. అక్కడ నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల సినిమా వసూళ్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే, రిస్క్ తీసుకోకుండా సినిమాను వాయిదా వేయడమే ఉత్తమమని నిర్మాతలు భావించారు. ఈ వాయిదాపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించినప్పటికీ, అకస్మాత్తుగా ఎదురైన ఈ అంతర్జాతీయ సంక్షోభం వల్ల రిలీజ్ డేట్‌ను మార్చక తప్పలేదు. ఏప్రిల్ 2వ తేదీన కాకుండా మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాక కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది. జార్జికుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే సినిమా బిజినెస్ మరియు అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?