NTV Telugu Site icon

Musi River: మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్..

Musi River

Musi River

మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ షురూ చేసింది. యాక్షన్ ప్లాన్ పై సెక్రటేరియట్‌లో MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి పలువురు అధికారులు భేటీ అయ్యారు. మూసీపై 13వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూసీ నివాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. ఈ క్రమంలో.. కూల్చివేతల సందర్భంగా నివాసితులు నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టింది అధికార యంత్రాంగం. ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా కల్పించిన తర్వాత.. హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగనున్నాయి. కాగా.. నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.