NTV Telugu Site icon

AP Govt: పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా..

Ex Gratia

Ex Gratia

అంబేద్కర్ కోసం జిల్లా గంటి పెదపూడి పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన బాధ్యత కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

Read Also: Rainbow Children’s Hospital: అగ్రగామి ఫార్మా కంపెనీలతో అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం..

మరోవైపు పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద బోటు ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోటు ప్రమాదంలో గల్లంతైన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను కలెక్టర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా రేపు బాధిత కుటుంబానికి అందజేస్తామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు.

Read Also: CM Chandrababu: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రేపు కీలక చర్చ..

ఉదయం.. వరద ప్రభావిత లంక గ్రామాలకు పడవలో వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో పడవలో ఆరుగురు ప్రయాణిస్తుండగా వరద ప్రవాహానికి పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురిని స్థానిక మత్స్యకారులు నాటు పడవలో వెళ్లి రక్షించగా.. ఒకరు గల్లంతు అయ్యారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు.