మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన నటనతో మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.పృథ్వీరాజ్ సుకుమారన్ గత ఏడాది వచ్చిన ‘సలార్’ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించి మెప్పించాడు.సలార్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే ఈ మలయాళ హీరో నటించిన సర్వైవల్ థ్రిల్లర్”ది గోట్ లైఫ్(ఆడు జీవితం )” ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది .ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది .ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ చిత్రాల జాబితాలో ఆడు జీవితం మూవీ చేరిపోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతుంది.ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న బ్లెస్సీ ‘ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. డిస్నీ+హాట్‌స్టార్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది.ఓటిటి నిబంధనల ప్రకారం ఈ సినిమా విడుదలైన 40 రోజుల తర్వాత ఓటిటిలో విడుదల కానుంది.దీని ప్రకారం మే 10న ఓటీటీలో ఆడు జీవితం విడుదల కానుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబందించిన అధికారికంగా ప్రకటన రానున్నట్లు సమాచారం ..
