NTV Telugu Site icon

The Goat Life OTT : ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Goat Life

Goat Life

ఈ ఏడాది తెలుగు సినిమాల కన్నా మలయాళ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ ఒకటి. మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.. తాజాగా ‘గోట్ లైఫ్’ సినిమా కూడా అదే లిస్ట్ లోకి చేరింది.. భారీ కలెక్షన్స్ రాబట్టి అదే లిస్ట్ లోకి చేరింది…

ఈ సినిమా మార్చి 28న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఇప్పుడీ మూవీ రానున్న శుక్రవారం నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఓటీటీలో కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.. 26 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని కూడా సమాచారం. ఈ రెండు తేదీలపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా రాలేదు.. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తుంది…

ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. కేరళకు నుంచి దుబాయ్ కి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు.. అక్కడ నుంచి ఎడారి మార్గం ద్వారా ఇండియా బయలు దేరతాడు.. ఇంతకీ అతను ఇండియా కు చేరుకున్నాడా? మార్గమధ్యలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ.. ఆ దేశాలకు వెళ్లిన ఇండియన్స్ ఎలాంటి జీవితాన్ని గడుపుతారన్నది సినిమాలో చక్కగా చూపించారు.. ఈ మూవీ కోసం హీరో, డైరెక్టర్ దాదాపు పదహారేళ్లు కష్టపడ్డారు.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ అయితే సినిమా కోసం చాలా కష్టపడి సన్నబడ్డాడు. నిజంగా అతని కష్టం ఊరికే పోలేదు.. సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Show comments