Rashmika Mandanna: చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి హిట్టందుకున్న రాహుల్ రవీంద్రన్.. ఆ తరువాత నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి భారీ పరాజయాన్ని చవిచూశాడు. ఆ సినిమా తరువాత డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా కొనసాగాడు. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ ను మేకర్స్ పరిచయం చేశారు. అదేనండీ హీరోను పరిచయం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
దియా అనే డబ్బింగ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు దీక్షిత్ శెట్టి. ఇక ఆ తరువాత దసరా సినిమాలో సూరిగాడి లా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దసరాలో నాని తో పోటీపడుతూ నటించి మెప్పించాడు. ఇప్పుడు రష్మిక సరసన నటించే అవకాశం పట్టేశాడు. గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ ఇతనే అంటూ మేకర్స్ తెలిపారు. నేడు దీక్షిత్ పుట్టినరోజు కావడంతో ఈ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి అతనికి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక వీడియోలో విక్రమ్ గురించి రష్మిక తన మాటల్లో చెప్తుండగా.. ఇంకోపక్క అగ్రెసివ్ గా ఉన్న విక్రమ్ ను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో దీక్షిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.
Happy Birthday to the heartthrob @Dheekshiths ❤️
Introducing the talented actor as 'The BOYFRIEND' of #TheGirlfriend ❤️🔥
Shoot in progress.@iamRashmika @23_rahulr @GeethaArts #AlluAravind @SKNOnline #VidyaKoppineedi @DheeMogilineni @HeshamAWMusic pic.twitter.com/IsOgfdiaBj
— Geetha Arts (@GeethaArts) December 22, 2023
