Site icon NTV Telugu

Ex Boy Friend : ఇంటర్వ్యూకి వచ్చిన యువతి.. సీటులో ఉన్న వ్యక్తిని చూసి షాక్

New Project (8)

New Project (8)

Ex Boy Friend : ఓ అమ్మాయికి జాబ్ అవసరం అవుతుంది. దీంతో ఇంటర్వ్యూ నిమిత్తం ఓ కంపెనీకి వెళ్తుంది. అక్కడ దృశ్యం చూసిన ఆమె కంగుతింటుంది. అక్కడికి వెళ్లిన తర్వాత తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి తన మాజీ ప్రియుడని తెలుసుకుంది. ఆరేళ్ల క్రితం విడిపోయిన వ్యక్తి హఠాత్తుగా తన ముందు కనిపించడంతో కంగారుపడిపోయింది. వారిద్దరూ విడిపోయిన తర్వాత అమ్మాయి కూడా అబ్బాయి నంబర్‌ను బ్లాక్‌ చేసింది. సాధారణంగా ఇలాంటివి సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. ప్రసుత్తం తనకు జరిగిన మొత్తం సంఘటనను ఆ అమ్మాయి సోషల్ మీడియా ద్వారా వెలువడించింది.

Read Also: Bandi sanjay: రేపు విచారణకు రండి.. బండి సంజయ్ కు సిట్ మరోసారి నోటీసులు

ఆ అమ్మాయి పేరు రెల్లీ జౌట్. ఆమె అమెరికాలోని ఆస్టిన్ నివాసి. ఆరేళ్ల క్రితం ఆమె ఒక అబ్బాయితో ప్రేమ బంధాన్ని విడిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత.. వారిద్దరూ కలుసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే అతను ఓ కంపెనీకి బాస్ అయ్యాడు. కానీ ఉద్యోగం నిమిత్తం అదే కంపెనీకి ఇంటర్వ్యూకి వస్తుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాడని తెలుసుకున్న అమ్మాయి చాలా కంగారుపడింది. మాజీ ప్రియుడిని ప్రియురాలు వెంటనే గుర్తించింది. ఆ సమయంలో ఆమెకు మరింత పని అవసరం కాబట్టి రీల్లీ జౌట్ పారిపోలేదు. ఈ కథనాన్ని ఆమె టిక్‌టాక్ ద్వారా ప్రజల ముందుకు తెచ్చింది. ఇదంతా చూసిన జనాలు ఆ వీడియో మరింత వైరల్‌గా మారింది. మాజీ ప్రియుడు యువతికి ఉద్యోగం ఇప్పించాడు. కానీ ఆ అమ్మాయి నో చెప్పింది. ఇప్పుడు ఆమె వేరే చోట పనిచేస్తోంది.

Read Also : Bank Holidays : ఏప్రిల్‎లో బ్యాంకులకు సెలవులే సెలవులు

మహిళ తెలిపిన సమాచారం ప్రకారం.. 19ఏళ్ల వయసులో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఆరేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ సంబంధంపై అబ్బాయి మరింత సీరియస్ అయ్యాడు. ఆ సమయంలో జౌట్‌ మనసులో అలాంటిదేమీ లేదు. ఆ సమయంలో, ఒక రోజు అమ్మాయి యువకుడితో అన్ని సంబంధాలను తెంచుకుంది. అతని మొబైల్ ఫోన్‌ను కూడా బ్లాక్ చేసింది. ఆరేళ్ల క్రితమే విడిపోయానని వీడియో ద్వారా చెప్పింది. ఈరోజు అతనిని ఉద్యోగం అడగాల్సి వచ్చింది. బహుశా విధి అంటే ఇదే కావచ్చని పేర్కొ్ంది.

Exit mobile version