NTV Telugu Site icon

World Cup 203: వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ ఉంటుందన్న ఇంగ్లిష్‌ మాజీ కెప్టెన్‌.. కౌంటరిచ్చిన భారత దిగ్గజం

Sehwag

Sehwag

ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ భారీ ఓటమి తర్వాత, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా ఇంగ్లండ్ ప్రపంచ కప్ 2023లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుందని చెప్పాడు. దీనికి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అద్దం చూపిస్తూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.

Read Also: Argentina: అబ్బాయిల వల్లే కాదు.. అమ్మాయిలు ఇన్ని పరుగులేంట్రా బాబు.. రికార్డు బద్దలు

మైఖేల్ వాఘన్ తన X ఖాతాలో “ప్రపంచ కప్ సెమీ-ఫైనల్స్‌లో ఇంగ్లాండ్” అని రాశాడు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ, “1996, 1999, 2003, 2007, 2011, 2015, 2023లో కాదు. 8 ప్రయత్నాలలో ఒక్కసారి మాత్రమే చేరుకుందని తెలిపాడు. ఇంగ్లండ్ ఓటమి తర్వాత సెహ్వాగ్ తన X ఖాతాలో ఇలా రాశాడు. “ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టాప్-4కు చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ ఓటమి తర్వాత భారత మాజీ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ కూడా మైఖేల్ వాన్‌పై విరుచుకుపడ్డాడు.

Read Also: Supreme Court: “ఆ గుండె చప్పుడును మేం ఆపలేం”.. గర్భవిచ్ఛత్తిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూడగా.. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 137 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ కు అఫ్ఘానిస్థాన్‌ చుక్కలు చూపించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.