NTV Telugu Site icon

AUS vs IND 2nd Test: ఆసీస్ విజయానికి వాళ్లిద్దరే కారణం.. మా టార్గెట్ అదే..!

Tim Paine

Tim Paine

అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే.. తొలిరోజు స్వింగ్ అవుతున్న పింక్ బాల్ ముందు మార్నస్ లబుషేన్, నాథన్ మెక్‌స్వీనీల అద్భుతంగా ఆడటంతోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరే ఆసీస్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. చాలా సేపు క్రీజులో ఉండి పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. లబుషేన్, మెక్‌స్వీనీ తొలి రోజు చివరి సెషన్‌లో 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌పై పట్టు సాధించారుని అన్నాడు.

Read Also: Ram Gopal Varma: హైకోర్టులో ఆర్జీవీకి మరోసారి ఊరట.. తొందరపాటు చర్యలొద్దు..!

టిమ్ ఫైన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మొదటి రోజు చివరి సెషన్‌లో మేము టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాం’ అని పేర్కొన్నాడు. ‘ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో పింక్ బాల్‌తో పూర్తి ఉత్సాహంతో బౌలింగ్ చేస్తున్న నిజమైన ఛాంపియన్‌ను మేము చూడగలిగాము.’ అని తెలిపాడు. ‘తన కెరీర్‌ను కాపాడుకోవడానికి.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువ బ్యాట్స్‌మెన్‌ని చూశామని.’ ఫైన్ చెప్పాడు.

Read Also: Group-2 Hall Tickets: గ్రూప్‌-2 హాల్‌ టికెట్లు విడుదల

తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 295 పరుగుల తేడాతో ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో.. ఆస్ట్రేలియన్ జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని ఫైన్ అన్నాడు. ‘కొన్నిసార్లు ఆటలో ఫెయిల్ అయినప్పటికీ ఆసీస్ గొప్ప జట్లలో ఒకటి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మినహా అన్ని ట్రోఫీల్లో విజయం సాధించాం. ఆస్ట్రేలియా ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవాలనుకుంటోంది. మా టార్గెట్ అదే’ అని టిమ్ ఫైన్ పేర్కొన్నాడు.