NTV Telugu Site icon

Kothagudem : కొత్తగూడెంను ముంచెత్తిన వరద

Kothagudem Floods

Kothagudem Floods

గత రాత్రి నుంచి కురుస్తున్న బారీ వర్షాల వల్ల కొత్తగూడెం పట్టణంలోకి నీళ్లు వచ్చారు.మాతా శిశు ఆసుపత్రి చుట్టు వరద నీరుచేరడంతోఆసుపత్రిలో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఎగువన ఉన్న చెరువుల నీరు అంతా పొంగి ప్రవహించి పట్టణంలోకి రావడంతో ప్రజలు ఇక్కట్లకు గురి అయ్యారు.దీంతోపట్టణంలోకి వాహనాలు రాకుండా నిలిపివేశారు. విద్యా నగర్ సమీపంలోని కొన్ని కాలనీలకు వరద నీరుచేరింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ లోకి చింత చెరువు ద్వారా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ప్రధానరహదారి మీదకు నీళ్లు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిదంగా వరద నీరు అంతా మాతా శిశు ఆసుపత్రిచుట్టు చేరింది.

  AP High Court: జగన్ కు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, జామర్ ఇవ్వాలని హైకోర్టు సూచన

దీంతోఆసుపత్రినుంచి ఎవ్వరు బయటకు వచ్చేఅవకాశం లేకుండా పోయింది. కొత్తగూడెం పరిదిలోని సుజాత నగర్,చుచు పల్లి,లక్ష్మి దేవి పల్లి మండలాల్లో లో తట్టు ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. కొత్తగూడెం మున్సిపాలిటి పరిదిలోని రామవరం, ఎస్ సి , బిసి నగర్ లు పూర్తిగా నీట మునిగాయి. చుంచుపల్లి విద్యానగర్ సమీపంలో రోడ్డు మీదకు కూడ నీళ్లు వచ్చి చేరాయి. దీంతో కొత్తగూడెం నుంచి ఖమ్మం రహదారి పై వాహనాలను నిలిపివేశారు.

 Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్ పరాజయంపై మోడీ ట్వీట్..పీటీ ఉషకి ప్రధాని ఫోన్