NTV Telugu Site icon

Vizag RK Beach: పర్యాటకులకు తప్పిన ప్రమాదం.. రెండో రోజే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

Vishaka

Vishaka

విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న ఆర్కే బీచ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించారు. అయితే.. అది తెగిపోయింది. కాగా.. ఫ్లోటింగ్ బ్రిడ్జి చివరి ఫ్లాట్ ఫామ్ భాగం సముద్రంలోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు.. పర్యాటకులు ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే.. ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిన్న ఆర్కే బీచ్లో అట్టహాసంగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు.

Read Also: Hyper Aadi: జనసేనకు 24 సీట్లు.. ఎమోషనల్ అయిన హైపర్ ఆది.. ఆ హక్కు మనకు లేదు..?

మనం తరుచుగా సోషల్ మీడియాలో ఫ్లోటింగ్ బ్రిడ్జి వీడియోలను చూస్తూ ఉంటాం. ఇలాంటి వీడియాలను చాలా మంది పోస్ట్ చేస్తారు. అయితే.. అలాంటి అనుభూతి పొందే వారికోసం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను విశాఖలో ప్రారంభించారు. అయితే ప్రారంభించిన రెండో రోజే ఇలా కొట్టుకోవడంపై పర్యాటకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు.. ఈ బ్రిడ్జి తెగిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అదృష్టవశాత్తు ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిన సమయంలో పర్యాటకులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని సముద్రంలోని చాలా దూరం వరకు నిర్మించారు.

Read Also: Russia-Ukraine War: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులు విడుదల!