NTV Telugu Site icon

Amarnath Yatra 2024 : అమర్‌నాథ్ పుణ్యక్షేత్రంలో తొలి పూజ పూర్తి..ఈనెల 29 యాత్ర ప్రారంభం

New Project (5)

New Project (5)

హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్‌నాథ్ గుహలో శనివారం ‘మొదటి పూజ’ జరిగింది. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) చైర్మన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన అధికారిక పోస్ట్‌లో పోస్ట్ చేశారు. బాబా అమర్‌నాథ్ జీ ఆశీర్వాదం తీసుకొని ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, పురోగతి, శ్రేయస్సు కోసం ప్రార్థించారు. కాశ్మీర్ హిమాలయాలలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ దేవాలయానికి పవిత్ర యాత్ర ఎల్లప్పుడూ మత సామరస్యానికి చిహ్నంగా ఉందని.. యాత్రికులు గుహ ఆలయానికి చేరుకోవడానికి స్థానిక ముస్లింలు సహాయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29 నుంచి యాత్ర ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 19న రక్షాబంధన్, శ్రావణి పూర్ణిమతో ముగుస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి సందర్శిస్తుంటారు.

READ MORE: IND vs BAN: భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన కీలక ఒప్పందాలు ఇవే…

మరో ప్రకటనలో.. “జమ్మూ కాశ్మీర్‌లో అన్ని వర్గాల ప్రజలు వారి మతంతో సంబంధం లేకుండా ఈ యాత్రలో పాల్గొనడం పురాతన సంప్రదాయం. దేశ విదేశాల నుంచి వచ్చే యాత్రికులను స్వాగతించడానికి, సేవ చేయడానికి పౌరులందరూ కలిసి రావాలని కోరుతున్నా. శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు, సంబంధిత శాఖల అధికారులు యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నారు. ప్రయాణం సాఫీగా, సురక్షితంగా మరియు అవాంతరాలు లేకుండా ఉండేలా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. భక్తులకు కావాల్సిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, భద్రతను గణనీయంగా పెంచాం.” అని పేర్కొన్నారు.

Show comments