NTV Telugu Site icon

IND vs NZ 3rd Test: వాంఖడేలో మొదటి రోజు ఎవరికి అనుకూలం.. పిచ్ రిపోర్ట్ ఇదే..!

Ind Vs Nz

Ind Vs Nz

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా.. చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే.. ఈ సిరీస్‌ని కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌.. క్లీన్ స్వీప్ పై కన్నేసింది. మరోవైపు.. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. కాగా.. సిరీస్‌ స్కోర్‌లైన్‌ ఎలా ఉంటుందనేది సిరీస్‌ చివరి మ్యాచ్‌ నిర్ణయిస్తుంది. ఇదిలా ఉంటే పిచ్ ఎలా ఉంటుందో మూడో టెస్టుకు సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇక్కడ ర్యాంక్ టర్నర్ పిచ్ ఉండదని, దానిపై స్పిన్నర్లకు టర్న్ వస్తుందని.. అయితే మొదటి రోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని నివేదికలలో పేర్కొన్నారు. బెంగళూరులో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తే.. పూణెలో స్పిన్నర్లకు అనుకూలించింది. అయితే ముంబైలో వాతావరణం కాస్త భిన్నంగా ఉండవచ్చు.

Kollu Ravindra: త్వరలో ఏపీలో మంచి మైనింగ్ పాలసీ తీసుకొస్తాం..!

సోమవారం బీసీసీఐ చీఫ్, పిచ్ క్యూరేటర్ ఆశిష్ భౌమిక్.. ఎలైట్ ప్యానెల్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీతో పాటు ముంబై వాంఖడే స్టేడియం క్యూరేటర్ రమేష్ మముంకర్ కలిసి పిచ్‌ను సమీక్షించారు. “ఇది స్పోర్టింగ్ ట్రాక్ అవుతుంది. ప్రస్తుతం పిచ్‌పై కొంత పచ్చిక ఉంది. ఈ వికెట్ మొదటి రోజు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే రెండవ రోజు నుండి స్పిన్నర్లు టర్న్ పొందడం ప్రారంభిస్తుంది” అని తెలిపారు.

CM Revanth: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై సీఎం కీలక వ్యాఖ్యలు..

చివరిసారిగా 2021 డిసెంబర్‌లో ఇరు జట్ల మధ్య ఇక్కడ టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఆ మ్యాచ్‌లో మొదటి రోజు నుండి స్పిన్నర్లకు సహకరించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 276/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు 167 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. టీమిండియా బౌలర్ అశ్విన్ 42 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు.

Show comments