Pune: పూణెలో ఓ కుటుంబం మృతి చెందిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. కొల్హాపూర్‌లో పారిశ్రామికవేత్త కుటుంబం ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో పారిశ్రామికవేత్త చాలా ఒత్తిడికి గురయ్యాడు. ఈ టెన్షన్‌తో కుటుంబసభ్యులతో కలిసి ఓ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఉదయం నిద్ర లేపేందుకు తల్లి వెళ్లగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ కుటుంబం విషం సేవించి తమ జీవితాలను ముగించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో గాధింగ్లాజ్ నగరంలో సంచలనం నెలకొంది. మరణించిన పారిశ్రామికవేత్త పేరు సంతోష్ షిండే. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:Health tips: ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? పొరపాటున కూడా వీటిని తినకండి..!
వివరాల్లోకి వెళితే.. గాధింగ్లాజ్ నగరానికి చెందిన పారిశ్రామికవేత్త సంతోష్ షిండేపై కొద్ది రోజుల క్రితం అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఈ అభియోగం కారణంగా దాదాపు నెల రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత, వారు ప్రతిదీ మరచిపోయి మళ్లీ ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఘటన ఇంకా మనసులో మెదులుతుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. మామూలుగా నిద్ర లేచే సమయమే అయినా షిండే లేవలేదు. దీంతో అతని తల్లి తలుపు తట్టేందుకు వెళ్లింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. అప్పుడు అతని తల్లి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి లోపలికి చూడగా బెడ్‌రూమ్‌లో షిండే, అతని భార్య, కొడుకు మృతదేహాలు కనిపించాయి. ఆ ముగ్గురి మెడపై గాయాలు కనిపించాయి.
Read Also:Minister RK Roja: హాయ్ ఏపీ.. బైబై బీపీ ( బాబు, పవన్) ప్రజల నినాదం..!
ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారంతా విషం తాగి మెడకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలియనున్నాయి.