NTV Telugu Site icon

AP Elections 2024: మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో ఎన్నికలు ఆ తేదీనే

Ap Poliing

Ap Poliing

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొంది. జూన్‌ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుందని తెలిపింది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎన్నికల షెడ్యూల్‌ వివరాలను వెల్లడించింది.

Read Also: Lok Sabha Elections 2024: ఏప్రిల్ 19 నుంచి లోక్ సభ ఎన్నికలు మొదలు.. 7 విడతలుగా ఎలక్షన్స్..

ఏపీ ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివరాలు..
నోటిఫికేషన్ విడుదల – ఏప్రిల్ 18
నామినేషన్లకు చివరి తేదీ- ఏప్రిల్ 25
నామినేషన్లు స్క్రూటినీ- ఏప్రిల్ 26
నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం- ఏప్రిల్ 29
ఎన్నికల తేదీ- మే 13
ఎన్నికల కౌంటింగ్- జూన్ 4