పశ్చిమ బెంగాల్‌లోని విద్యా శాఖ మూడు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలలో ఈ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపింది. ఈ క్రమంలో.. విద్యాశాఖ చర్యలు చేపట్టింది. హౌరా జిల్లాలోని బలుహతి సెకండరీ స్కూల్, బలుహతి గర్ల్స్ సెకండరీ స్కూల్, బంట్ర రాజలక్ష్మి గర్ల్స్ స్కూళ్లకు నోటీసులు పంపింది. 24 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖ ఈ పాఠశాలలను ఆదేశించింది.
Read Also: Tragedy: విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
విద్యార్థులతో పాటు పలువురు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా ర్యాలీలో పాల్గొన్నారని.. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ విషయంలో సరైన సమాధానాలు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరగతుల సమయంలో విద్యార్థులు ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనకూడదని పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విద్యార్థులను ర్యాలీకి తీసుకెళ్లినట్లు తమకు తెలిసిందని విద్యాశాఖ తెలిపింది.
Read Also: Mia Khalifa: మోసం చేసి పోర్న్ స్టార్ ని చేశాడు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మియా ఖలీఫా
ఈ పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి ముందు.. పాఠశాల లేదా డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలలో విద్యార్థులు పాల్గొనడం నిషేధించబడుతుందని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని జిల్లా ఇన్‌స్పెక్టర్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా వైద్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ ర్యాలీల్లో విద్యార్థులను చేర్చుకుంటున్నట్లు వార్తలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు జిల్లా ఇన్‌స్పెక్టర్ తెలిపారు. అయితే.. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన సంఘటన గురించి నోటీసులో ప్రస్తావించలేదు.
