NTV Telugu Site icon

Vultures Death India: భారత్ లో రాబందుల తగ్గుముఖం..మానవ మనుగడకు ముప్పు..

Vultures

Vultures

భారత్‌లో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడుతోంది. ఈ తగ్గుదలతో మానవ మరణాల పెరుగుదలకు సంబంధముందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ జర్నల్‌లో 2000 నుంచి 2005 వరకు డేటా ఆధారంగా ప్రచురించబడింది. రాబందుల సంఖ్య తగ్గిన జిల్లాల్లో మానవ మరణాల కేసులు కనీసం 4 శాతం పెరిగాయని అధ్యయనం పేర్కొంది. చనిపోయిన జంతువులను తినే వీధికుక్కలు, ఎలుకల నుంచి రేబిస్ కేసులు పెరుగదల కారణంగా.. మానవ మరణాలు సంఖ్య పెరుగుతోందని అధ్యయనం వెల్లడించింది. ఇదే కాకుండా.. నీటి కాలుష్యం, ఉపరితలంపై ప్రవహించే కలుషితమైన నీరు కూడా దీనికి కారణమని పరిగణించింది.

READ MORE: UPSC Tutor: శ్రీరాముడిని అక్బర్‌తో పోల్చిన ట్యూటర్.. విమర్శల దాడితో క్షమాపణలు..

ఢిల్లీలోని ఘాజీపూర్ పల్లపు ప్రదేశం ఇప్పటికీ రాబందులు కనిపించే కొన్ని ప్రదేశాలలో ఒకటి. 1990 వరకు భారతదేశంలో తరచుగా కనిపించే ఈ పక్షులు ఇప్పుడు వేగంగా అంతరించిపోతున్నాయి. 5 కోట్ల జనాభా కలిగిన ఈ పక్షులు ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. రాబందుల సంఖ్య తగ్గుముఖం పట్టడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని, వాటి జనాభాను పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

READ MORE:Andhra Pradesh: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల్లో గ్రామాలు

రాబందులకు మానవ మరణానికి ఎలాంటి సంబంధం ఉంది?
అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ (AEA) జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం.. 2000- 2005 మధ్య రాబందుల సంఖ్య తగ్గిన జిల్లాల్లో.. మానవ మరణాల్లో కనీసం 4 శాతం పెరుగుదల ఉంది. కొన్ని జంతువులు చనిపోయిన కళేబరాలను తినడం వల్ల ఇది జరిగిందని అధ్యయనం తెలిపింది. రాబందులకు కళేబరాలు మాత్రమే ఆహారం. అందువల్ల రాబందులు చాలా సమర్థవంతమైన స్కావెంజర్లుగా పరిగణించబడతాయి. కుక్కలు, ఎలుకలు వంటి జాతుల లాగా..రాబందులు మాంసాన్ని వదిలివేయవు. అందువల్ల వ్యాధులను వ్యాప్తి చేసే అవకాశం తక్కువ.

READ MORE: Paris Olympics 2024: రెండో రోజు భారత్ శుభారంభం..ఫైనల్ కి చేరిన టీంలు..

అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు..
రాబందులు లేనప్పుడు.. కుళ్ళిన మాంసం, దాని వాసన వీధి కుక్కలను ఎలా ఆకర్షిస్తుందో అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యయనం వివరిస్తుంది. కుక్కలు, ఎలుకలు మాంసాహారాన్ని తిన్నప్పుడు వాటిని పూర్తిగా శుభ్రం చేయకపోవడం వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఈ జంతువులు తక్కువ సమర్థవంతమైన స్కావెంజర్‌లు., మృతదేహాల కుప్పలు వ్యాధికి సంతానోత్పత్తి ప్రదేశంగా చేస్తాయి. ఎలుకలు, వీధికుక్కల సంఖ్య పెరగడం వల్ల రేబిస్ కేసులు పెరుగుతున్నాయి. ఆంత్రాక్స్ వంటి వ్యాధులు ఇతర జంతువులకు..మానవులకు వేగంగా వ్యాపిస్తాయి.

READ MORE: Tamil Nadu: తమిళనాడులో మరో రాజకీయ హత్య.. ఏఐడీఎంకే నేత మర్డర్..

రాబందులు ఎల్లప్పుడూ మాంసాన్ని పూర్తిగా తినేస్తాయి. అక్కడ ఎలాంటి వ్యర్థాలను వదిలేయవు. తద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం తగ్గుతుంది. నదుల్లో మృతదేహాలను విసిరేయడం వల్ల వాటి నీరు కూడా కలుషితమవుతుందని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఉపరితలంపై ప్రవహించే కలుషిత నీరు కూడా వ్యాధులను పెంచుతుంది. అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం.. ఈ కారణాల వల్ల మానవ మరణాలు పెరిగాయి.