మలయాళం కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘ప్రేమమ్’..ఫిబ్రవరి 1న కేరళ, తమిళనాడులో ఈ సినిమాను మరోసారి థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే రీ రిలీజ్‌లో ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. రెండు చోట్ల ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ రాబడుతోంది. ఐదు రోజుల్లోనే రెండు కోట్ల కుపైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. తమిళం మరియు మలయాళంలో రీ రిలీజ్ సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీస్‌లో ఒకటిగా ప్రేమమ్ మూవీ నిలిచింది.ప్రస్తుతం రీ రిలీజ్ అవుతున్న సినిమాలు రెండు లేదా మూడు రోజులే థియేటర్లలో ఆడటం కష్టం. కానీ ప్రేమమ్ మాత్రం రిలీజై ఐదు రోజులు అయినా కూడా చెన్నైలోని చాలా థియేటర్లలో ఆడుతోండటంతో సర్‌ప్రైజ్‌తో పాటు సంతోషంగా ఉందని అనుపమ పరమేశ్వరన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడం ప్రేమమ్ రీ రిలీజ్‌కు ప్లస్సయింది.అయితే ప్రేమమ్ థియేటర్లలో రీ రిలీజ్ కావడం ఇది మూడోసారి. 2016లో వాలెంటైన్స్ డే సందర్భంగా తమిళంలో ఈ మూవీని రీ రిలీజ్ చేశారు. అలాగే 2017లో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత రీ రిలీజ్ రూపంలో మూడోసారి థియేటర్లలో ప్రేమమ్ విడుదలైంది.
మూడుసార్లు రీరిలీజైన ప్రేమమ్ మూవీకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ప్రేమమ్ మూవీకి ఆల్ఫోన్సో పుత్రేన్ దర్శకత్వం వహించాడు. మలయాళంలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో కొత్త నటీనటులతో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఏకంగా 75 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ మలయాళ మూవీ తమిళనాడులోని పలు థియేటర్లలో 200 రోజులకుపైగా ఆడింది.ప్రేమమ్ మూవీతోనే సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ప్రేమమ్ మూవీని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ రీమేక్‌లో నాగచైతన్య హీరోగా నటించారు. చందు ముండేటి దర్శకత్వం వహించారు. మలయాళ మాతృకలో నటించిన అనుపమ పరమేశ్వరన్ మరియు మడోన్నా సెబాస్టియన్ తెలుగులో రీమేక్‌లో హీరోయిన్లుగా కనిపించారు. కానీ సాయిపల్లవి పాత్రలో మాత్రం తెలుగులో శృతిహాసన్ చేసారు.. తెలుగులో కూడా ప్రేమమ్ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది.