NTV Telugu Site icon

CPI(M): ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ(ఎం)..

Cpi

Cpi

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది. అయితే, లోక్ సభ అభ్యర్థిగా కేవలం ఒకరినే ప్రకటించగా.. 10 అసెంబ్లీ స్థానాలకు క్యాండిడెట్ల పేర్లను వెల్లడించింది. అలాగే, కాంగ్రెస్‌తో పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత అరకు పార్లమెంటు, 5 అసెంబ్లీ (రంపచోడవరం, కురుపాం, గన్నవరం, మంగళగిరి, నెల్లూరు సిటీ) స్థానాలపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, మిగతా 5 స్థానాలపై చర్చలు కొనసాగించి నామినేషన్‌లోగా ఒక అవగాహనకు రావాలని ఇరు పార్టీలు అభిప్రాయ పడుతున్నాయి.

పార్లమెంట్ అభ్యర్థులు:
1. అరకు (ST) – పాచిపెంట అప్పలనర్స

అసెంబ్లీ అభ్యర్థులు వీరే:
1. రంపచోడవరం (ST)- లోతా రామారావు
2. అరకు (ST)- దీసరి గంగరాజు
3. కురుపాం (ST)- మండంగి రమణ
4. గాజువాక- మరడాన జగ్గునాయుడు
5. విజయవాడ సెంట్రల్‌- చిగురుపాటి బాబురావు
6. గన్నవరం- కళ్ళం వెంకటేశ్వరరావు
7. మంగళగిరి- జొన్నా శివశంకర్‌
8. నెల్లూరు సిటీ- మూలం రమేష్‌
9. కర్నూలు – డి.గౌస్‌దేశాయి
10. సంతనూతలపాడు (SC)- ఉబ్బా ఆదిలక్ష్మి