NTV Telugu Site icon

Beer Bottle Color: బీర్ బాటిళ్లు ఆకుపచ్చ, గోధుమ రంగుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

Beer Bottels Color

Beer Bottels Color

Beer Bottle Color: ధూమపానం సేవించడం, ఆల్కహాల్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిన విషయమే. మద్యం తాగడం, ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ధూమపానం పెట్టెలపై క్యాన్సర్ కు దారితీస్తుందని పెద్ద అక్షరాలతో రాసిపెట్టిన ప్రజలు మాత్రం వాటిని తాగకుండా ఉండలేకున్నారు. అలాగే మద్యం ప్రియులు కూడా మద్యాన్ని తాగడం అదుపు చేసుకుందామనుకున్న వారి వల్ల కావడం లేదు. అంతెందుకు, ప్రభుత్వాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేద్దామన్న కానీ కుదరడం లేదు. ఇకపోతే, మద్యంలో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం బీరు వంతు. దేశంలో అనేక బీర్ కంపెనీలలో బీర్ తయారవుతుంది. వీటిపై ఆయా కంపెనీలో వారి సంబంధించిన లేబుళ్లు అందించి మార్కెట్లో విక్రయిస్తున్నాయి.

Also Read: Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్.. 900 మంది పోలీసులు.. 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ

ఇది ఇలా ఉండగా.. కంపెనీ ఏదైనా సరే, బీర్ బాటిల్స్ మాత్రం కేవలం రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. బీర్ సీసాలో ఈ రెండు రంగుల్లోనే ఎందుకు ఉన్నాయి. అసలు వేరే రంగుల బాటిలలో ఎందుకు ఉండవని ఎప్పుడైనా ఆలోచించారా.? లేదు కదా.. అసలు ఎందుకు ఇలా చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. కొద్ది సంవత్సరాల క్రితం ఈజిప్టులోని బీర్ బాటిళ్లు పారదర్శకమైన సీసాలలో బీరు అందించేవారు. అయితే, పారదర్శక సీసాలు సూర్యరశ్మికి గురైనప్పుడు, UV కిరణాలు బీర్ లోపల ఉన్న రసాయన సమ్మేళనాన్ని వేగంగా మార్చాయని వారు గుర్తించారు. దానితో బీరులో రుచికి సంబంధించిన వైవిధ్యం కనబడింది. అంతేకాదు, అలాంటి బీరు తాగడం వల్ల చాలామంది అస్వస్థకు కూడా గురయ్యారు. దాంతో బీరును బాటిల్స్ లో సరిగా ఉంచడం అనే విషయంపై పరిశోధనలు మొదలయ్యాయి. దాంతోనే ఓ కొత్త ఆలోచన వచ్చింది.

Also Read: Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

సూర్యకిరణాల నుండి బీరును బాటిల్స్ లో రక్షించడానికి సన్ గ్లాస్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీలో కాంతిని చెదరగొట్టే రంగులలో బీరు సీసాలను తయారు చేయడం మొదలుపెట్టారు. దాంతో గోధుమ రంగు సీసాలలో బీర్ నింపడం మొదలుపెట్టారు. ఇలా చేసిన తర్వాత సూర్యలక్ష్మి బీరులోకి ప్రవేశించలేకపోయినట్లు పరిశోధనలు తేల్చాయి. దాంతో బీర్ చాలా కాలం మంచిగా ఉంటూ.. ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా ఉంది. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ గోధుమ రంగు సీసాల ఉత్పత్తి బీర్ ఆర్డర్ల కంటే తక్కువగా ఉండడంతో దాంతో పచ్చ సీసాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కూడా బీరు ఎక్కువకాలం నిల్వ ఉండడంతో అప్పటినుంచి గోధుమ ఆకుపచ్చ రంగులలో బీరు అమ్మకాలను చేపడుతున్నారు. ఈ రెండు రంగులు మాత్రమే కాకుండా పారాదర్శక సీసాలలో కూడా బీరును విక్రయిస్తారు. కాకపోతే ఎక్కువగా ఆకుపచ్చ గోధుమ రంగులోనే వీటిని విక్రయిస్తారు.