NTV Telugu Site icon

Parliament Sessions: నేడు అఖిలపక్షం భేటీ.. పార్లమెంట్ లో పలు బిల్లుల ఆమోదానికి కసరత్తు..

Parlament

Parlament

డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. 19 రోజుల్లో 15 సిట్టింగుల్లో పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఈ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో ప్రహ్లాద్ జోషి, రాజ్ నాథ్ సింగ్, పీయూష్ గోయల్ సహా వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొంటారు. కేంద్ర సర్కార్ కి సంబంధించిన పలు కీలక బిల్లులను పార్లమెంట్ సెషన్స్ లో ప్రవేశ పెట్టేందుకు రెడీ అయింది. ఈ బిల్లులపై అఖిల పక్షం సమావేశం దృష్టికి తీసుకెళ్లనున్నారు.

Read Also: Kurnool Medical College: సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు.. యూజీసీ కి ఫిర్యాదు

అయితే, పార్లమెంట్ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులను సభ ముందుకు తీసుకొచ్చేందుకు మోడీ సర్కార్ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మరో ఏడు కొత్త బిల్లులను ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అంతేగాక, ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లను ఆమోదం కోసం పార్లమెంట్ ముందుకు తీసుకు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ మూడు బిల్లులపై ఇప్పటికే చర్చించి స్పీకర్ కు హోం శాఖ స్థాయి సంఘం నివేదికను ఇచ్చింది.

Read Also: China Virus: చైనాలో కొత్త వైరస్.. అమెరికా అప్రమత్తం.. రాకపోకలు నిషేదం..

ఇక, ముగ్గురు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్ సమావేశాల్లో సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లనుంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలపై లోక్‌సభ ముందుకి ఎథిక్స్ కమిటీ నివేదిక వెళ్లనుంది. మొహువా మొయిత్రాపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఈ కమిటీ సూచించింది. లోక్ సభలో ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ పై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, రేపు తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో, ఎల్లుండి మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.