బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’. ఫిబ్రవరీ 9న విడుదలకు సిద్ధమయిన ఈ సినిమాకు ఇప్పుడు సెన్సార్ కష్టాలు ఎదురవుతున్నాయి.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఈ సినిమాకు చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసింది.ఇందులో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఒక ఇంటిమేట్ సీన్ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీంతో పాటు సినిమాలోని సెకండ్ హాఫ్ లోని ఒక సీన్లో ‘దారు’ అనే పదాన్ని తొలగించి ‘డ్రింక్’ అనే పదాన్ని యాడ్ చేయమని చెప్పిందట. షాహిద్ కపూర్, కృతి సనన్ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా వీరిద్దరూ ఎప్పుడూ కలిసి నటించలేదు. ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ కోసం మొదటిసారి వీరిద్దరూ జతకట్టారు. మొదటి సినిమాతోనే వీరిద్దరూ అదిరిపోయే కెమిస్ట్రీని కనబరిచారని టాక్ వినిపిస్తోంది.‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’లోని కొన్ని ఇంటిమేట్ సీన్స్ తొలగించాలని సీబీఎఫ్సి మరీ మరీ చెప్పిందట.
ఇక ఆ సీన్స్ తప్పకుండా తొలగించడంతో మూవీ రన్ టైమ్ కూడా చాలా తగ్గుతుందని సమాచారం.ఆ ఇంటిమేట్ సీన్ లో 9 సెకండ్లు తొలగించమని సెన్సార్ బోర్డ్ ఆదేశించిందట. దీంతో మూవీ ఒరిజినల్ రన్ టైమ్ 36 సెకండ్ల నుండి 27 సెకండ్లకు తగ్గిపోయింది. దీంతో పాటు స్మోకింగ్ సీన్స్ వచ్చినప్పుడు ధూమపానం హానికరం అని కనిపించే విధంగా వార్నింగ్ ఇవ్వమని సెన్సార్ ఆదేశించినట్టు సమాచారం.. మొత్తంగా సెన్సార్ కట్స్ పూర్తయిన తర్వాత ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’కు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. సినిమా రన్ టైమ్ 143.15 నిమిషాలు.. అంటే 2 గంటల 23 నిమిషాల 15 సెకండ్లకు చేరింది.ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అమిత్ జోషీ మరియు ఆరాధనా సాహ్ కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో కృతి సనన్ రోబోగా నటించగా.. రోబోకు, మనిషికి మధ్య జరిగే ప్రేమకథగా ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ తెరకెక్కింది.