Site icon NTV Telugu

Kaveri water: కర్ణాటకకు షాక్‌ .. తమిళనాడుకు రోజూ 5వేల క్యూసెక్కులు

Water

Water

The Cauvery Management Authority Board: ఇప్పటికే నీటి సమస్యతో అల్లాడుతున్న కర్ణాటకపై మరో భారం పడింది. కర్ణాటకకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. సోమవారం జరిగిన కావేరి నదీ జలాల నిర్వహణ కమిటీ సమావేశంలో బోర్డు కర్ణాటక ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. వర్షాలు పడనప్పటికీ మరో 15 రోజుల పాటు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేయాలని కావేరీ మేనేజ్మెంట్ అథారిటీ బోర్డ్ ఆదేశించింది. ఇప్పటికే తమిళనాడుకు ప్రతి రోజు 1, 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దీనికి అదనంగా మరో 3,100 క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది కావేరీ నదీ జలాల నిర్వహణ కమిటీ. 22 శాతం అంశాన్ని అనుసరించాలని, వర్షాభావ కారణంగానే నీరు లేక తాము ఇంతలా పట్టుబడుతున్నామని తమిళనాడు తెలిపింది.

Also Read: Father Death: ఈమె అసలు కూతురేనా.. తండ్రి చనిపోయాడంటే ఎలా మాట్లాడిందో చూడండి

దీనిపై స్పందించిన అథారిటీ చైర్మన్ వర్షపాతానికి వచ్చే ప్రవాహానికి సంబంధం లేదన్నారు. దీనికి తోడు కర్ణాటక సభ్యులు కూడా వర్షపాతం పై కాకుండా వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగానే రెండు రాష్ట్రాల పరిస్థితులను అంచనా వేశారు. దీంతో వచ్చే 15 రోజుల పాటు రోజుకు 5000 కూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కోరారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే నీటిని తాగునీటి కోసం నిల్వ ఉంచుకోకుండా వ్యవసాయం కోసం ఎక్కువగా తరలించింది తమిళనాడు ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం అక్కడ నీటి సమస్యలు తలెత్తాయి. ఇక కర్ణాటక ప్రభుత్వం మాత్రం నీటిని ఆచితూచి ఖర్చుచేస్తుంది. వర్షాభావ పరిస్థితులు ఉండటంతో, ఆగస్ట్‌లో వానలు కురవకపోవడంతో పంటలు వేయవద్దని కావేరి పరీవాహక ప్రాంత రైతులను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ విషయంలో రైతులు ప్రభుత్వంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కావేరీ నీటిని తమిళనాడుకు మళ్లించి రావడం కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై వెనక్కి తగ్గకుండా ఢిల్లీలో జరగనున్న కావేరీ రివర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశంలో మాట్లాడాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. నీటిని విడుదల చేయలేమని గట్టిగా వాదించాలని నిర్ణయించింది కర్ణాటక ప్రభుత్వం. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి

Exit mobile version