Road accident: డంపర్ ను వెనక నుంచి ఢీకొట్టిన కారు.. ఎనిమిది మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతి వేగం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందు నిలిపి ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటలకు ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిది మంది వ్యక్తులతో వెళ్తున్న కారు అతివేగంగా వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న డంపర్‌ను వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కారులో వ్యక్తులంతా అందులోనే ఇరుకుపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
READ MORE: Pakistan: భారత్ అభివృద్ధిపై పాక్ చట్టసభల్లో ఆసక్తికర చర్చ.. ఏమన్నారంటే..?
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులోని వ్యక్తులను బయటకు తీసేందుకు యత్నించారు. వేగంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయని.. మరో వ్యక్తి గాయపడ్డారని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో ఇసుక చెల్లాచెదురుగా పడిపోయింది. మృతులు భాగ్‌తండా నుంచి గుణకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు. మృతుల్లో ఒకరు పోలీస్ అని.. అతని వద్ద ఐడీకార్డు లభించినట్లు వారు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి సమయం కావడంతో ముందు నిలిపి ఉన్న వాహనం సరిగ్గా కనిపించలేదు. రాత్రి సమయం కావడంతో డ్రైవర్ నిద్రలోకి జారుకునే అవకాశం కూడా ఉండొచ్చని అంచనా.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..