మ్యారేజ్ అంటే.. రెండు కుటుంబాల్లో ఎన్నో భయాలు.. టెన్షన్లు ఉంటాయి. ఇక వధూవరులు ఎన్నో కలలు కంటారు. పెళ్లి మండపంలో అందరూ ఉండగానే.. వధువును అక్కడికి వెంటబెట్టుకుని తీసుకొచ్చే సందర్భం అందరూ చూసేలా చేస్తుంది. అయితే.. జార్ఖండ్ లోని బడిదిహ్ జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఓ పెళ్లి పీడకలలా మారింది. బడిదిహ్ గ్రామానికి చెందిన వీరేంద్ర సావ్ తన కొడుకు త్రిలోక్ కుమార్ కోసం మాల్దా గ్రామంలో నివసిస్తున్న సంపన్న కుటుంబంలోని అమ్మాయితో పెళ్లి నిశ్చయించారు. రెండు కుటుంబాలు.. బడిదిహ్‌లోని బగ్లాసోట్ శివాలయంలో పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలు కూడా సంప్రదాయబద్ధంగా జరిగాయి.
Also Read : G-20: హైదరాబాద్ లో నేటి నుంచే G-20 సదస్సు.. 30 దేశాల వ్యవసాయ మంత్రుల రాక
కానీ పెళ్లి రోజు రాత్రే తేడా వచ్చింది. సోమవారం అర్థరాత్రి.. పెళ్లి బృందం పెళ్లికి, రిసెప్షన్‌కు వచ్చింది. గుడికి వచ్చిన వరుడికి బంధువులు, స్థానికులూ ఆనందంగా ఘన స్వాగతం పలికారు. అయితే.. ముహూర్తానికి టైమ్ దగ్గర పడింది.. మరో ఐదు నిమిషాల్లో వధూవరులు దండలు మార్చుకోవాల్సి ఉండగా.. ఇంతలో వధువు.. ఓ హారం వేసుకోవడం మర్చిపోయాననీ చెప్పి.. 5 నిమిషాల్లో ధరించి వస్తానని ఓ గదిలోకి వెళ్లింది.
Also Read : Weight Loss Tips: వేసవిలో ఈ కూరగాయలు తింటే.. ఇట్టే బరువు తగ్గుతారు!
దీంతో వధువు సడెన్‌గా అలా వెళ్లడంతో.. పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటు ఉండిపోయారు. 5 నిమిషాల తర్వాత కూడా వధువు రాకపోవడంతో ఆమె వెళ్లిన గదిలోకి వెళ్లి చూడగా.. అక్కడ ఆమె లేదు. అక్కడికి 300 మీటర్ల దూరంలో ఓ కుర్రాడు బైక్‌పై వెయిట్ చేస్తున్నాడు.. ఇంతలోనే పెళ్లికూతురు.. రోడ్డుపై పరుగెడుతూ.. లెహంగాను రోడ్డుపైనే వదిలేసి అతనితో లేచిపోయింది. ఇక.. ఈ విషయం తెలిసిన రెండు కుటుంబాలవారూ షాక్ అయ్యారు. ఆమె కోసం ఆ రాత్రి వెతికినా వధువు కనిపించలేదు. వధువు తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు.